వైసీపీ నేతలకి, సీబీఐ కి విడదియ్యని అనుబంధం ఉందనే చెప్పాలి. రాష్ట్రం లోనే కాదు, దేశ రాజధాని డిల్లీలో సీబీఐ సోదాలు చేసినా వైసీపీ నేతల పేర్లే వస్తున్నాయి. ఈసారి ఎవరు బయటపడ్డారు అనుకుంటున్నారా…
వల్లభనేని బాలశౌరి కిందటి ఎలక్షన్స్ లో గుంటూరు నుంచి లోక్ సభకి పోటి చేసి జయదేవ్ గళ్ళ చేతిలో ఓటమిపాలయ్యారు. చాలా రోజులుగా ఇయన పేరు పెద్దగా వినిపించట్లేదు. ఐతే అనుహ్యంగ సీబీఐ ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి పోలు శ్రీధర్ పై దాడి చేసి విచారిస్తున్న సమయంలో బాలశౌరి గుట్టు బయటపడింది. ఆయనకు చెందిన రూ.11 కోట్ల 9 లక్షల అక్రమ ఆస్థుల్ని సీబీఐ సీజ్ చేసింది. శ్రీధర్‌తో పాటు ఢిల్లీ నజాఫ్‌గఢ్ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌పైన కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది.
గుంటూరు, హైదరాబాద్, నోయిడాల్లోని వల్లభనేని బాలశౌరి ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై బాలశౌరి ని ఏ క్షణంలో నైనా సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ విషయంపై బాలశౌరి స్పందిస్తూ… ఇందులో తనకేమీ సంబంధంలేదని, చట్టప్రకారమే రూ. 12.5 కోట్లతో 20 ఎకరాల పొలం కొనుగోలు చేశామన్నారు.
No comments:
Post a Comment