అమరావతి రాజధానిలో అక్టోబరు 28న ఆర్థిక, పరిపాలన నగరాలకు శంకుస్థాపన.. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి.... అక్టోబరు 28న ఆర్థిక, పరిపాలన నగరాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన జరపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతికి శంకుస్థాపన చేసి 22కి ఏడాది పూర్తి అవుతుంది అని, ఏడాదిలో అమరావతి నిర్మాణంలో సంతృప్తికర ఫలితాలు సాధించామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
విభజన గాయాలతో వచ్చి బస్సులో వుండి పాలన చేసిన రోజులతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయన్నారు. స్వల్ప కాలంలోనే వెలగపూడి సచివాలయం నిర్మించడం ఒక చరిత్ర అని సంతృప్తిని వ్యక్తం చేశారు. పాలన సొంత నేలపైనే వుంటేనే ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయని త్వరగా వచ్చేశామన్నారు. ఏడాదిలో అమరావతి నిర్మాణంలో సంతృప్తికర ఫలితాలు సాధించామన్నారు. అభివృద్ధి ఇంతటితో ఆగేది కాదు, అది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
సచివాలయానికి కొత్త సొబగులు అద్దినట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు చేరువగా ఏకకాలంలో రెండు బ్యాంకుల శాఖలు ప్రారంభం జరిగింది. వెలగపూడి సచివాలయంలో రెండు బ్యాంకుల శాఖలను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు జరపడమే నల్లధనం నియంత్రణకు పరిష్కారం అని అన్నారు.
No comments:
Post a Comment