ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ వేడుకని అమరావతి ప్రాంతంలో రైతులు ఘనంగా చేసుకున్నారు. రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, జొన్నలగడ్డ వినయ్, పాపినేని నాగేశ్వరావు, గుమ్మా వెంకటేశ్వరావు, అబ్బూరి మురళి, బండ్ల పట్టాభిరామయ్య తదితరులఆధ్వర్యంలో ఉద్దండ్రాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోని శిలాఫలకానికి శనివారం రైతులు పూలమాలలు వేసి, కొబ్బరి కాయలు కొట్టారు. పాల్గొన్నారు.
తెలుగు యువత అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరావు(మల్లి) ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉద్దండ్రాయునిపాలెం నుంచి వెలగపూడి సచివాలయం వరకు చేసిన పాదయాత్రని మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
మరోవైపు బాపట్ల మండలం వెదుళ్ళపల్లిలో నవ్యాంధ్ర చైతన్యవేదిక అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్రకు నవోదయం.. అమరావతికి శుభోదయం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంధ్రులు మర్చిపోలేని రోజుని గుర్తుండిపోయేలా ఘనంగా వేడుకలు చేసుకున్నారు.
No comments:
Post a Comment