అమరావతి పాలకుడు ఎవడు?
జానపద వాగ్మయం అనేక సత్యాలు చెబుతుంది. అందులో అనేకం వినికిడి సత్యాలు మాత్రమే వుంటాయి. నేదునూరి గంగాధరంగారు సేకరించగా, జయధీర్ తిరుమలరావుగారు పరిష్కరించిన పుస్తకంలో ఇలా వుంది...
‘‘
యోగవిద్య
మొదటి ప్రతాపరుద్రుడు (1140-1196). ఈయనకు ముక్కంటి దేవుడు, రుద్రదేవుడు అనే పేర్లున్నాయి. ఈయన యోగాభ్యాసం చేసి యోగ బలమున నిత్యము కాశీకి పోయి స్నానము చేసి, భార్యయగు అంబికా దేవికి తెలియకుండగ, ఆమె మేల్కొనక ముందే మరల వచ్చెడివాడు.
ఒకసారి ఈ విషయాన్ని ఆమె గ్రహించి తాను కూడా భర్త యోగబలంతో కాశీ వెళ్లింది. అయితే అక్కడ ఆమె బహిష్టురాలయింది. ఆ దోషం వల్ల ప్రతాపరుద్రుడి యోగవిద్య నశించింది. అక్కడ వున్న బ్రాహ్మణులను పిలిచి భార్యాసమేతంగా తన రాజధాని అయిన ధరణికోటకు (అమరావతి) చేర్చవలసిందిగా వేడుకున్నాడు. బ్రాహ్మణులు షరతు విధించారు. వచ్చే పన్నెండేళ్లలో దారుణమైన కరవు రాబోతున్నది. మమ్మల్ని ఆదుకుంటే.. నీకు ఆ యోగబలాన్ని పునరుద్ధరిస్తాం అన్నారు. ప్రతాపరుద్రుడు సరేనన్నాడు. రాజు, రాణిగార్లను శుద్ధులను చేసి క్షణమాత్రంలో ధరణికోటకు చేర్చారు. ఈ కథ నంద చక్రవర్తి, నందవరీకుల సంబంధముగ వినుకొండదండ కవిలెలో వున్నది
’’
మొన్నెవరో ... కాకతీయుల దానం వెలగపూడి అని రోతరాతలు రాసిన నేపథ్యంలో ఈ జానపద విజ్ఞాన వ్యాసంలోని ఈ వాక్యాలు కనిపించి కొంచెం చారిత్రక హాచ్చర్యం కలిగింది.

No comments:
Post a Comment