Tuesday, October 18, 2016

గిన్నిస్ రికార్డుకు బాబు పథకం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎన్నో భీమాలు,పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల మన్ననలు పొంది, వారి ముఖంలో చిరునవ్వుకు కారణమయింది.వాటిలో ప్రతి పేదింటి వారు చెప్పుకునేది ‘చంద్రన్న భీమా’ గురించే.
అలాంటి ‘చంద్రన్న భీమా’ పథకాన్ని గిన్నిస్ రికార్డుకు పంపే ప్రతిపాదనల్లో ఉన్నామని ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ పథకంపై ఈరోజు తొలి సమీక్షా సమావేశం నిర్వహించిన అయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ సర్వేలో ఇప్పటివరకు 1.70 కోట్ల మంది ‘చంద్రన్న భీమాలో సభ్యులుగా చేరారని, మరో 60 లక్షల మంది సైతం సభ్యులుగా చేరే అవకాశం ఉండగా అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు అన్నారు. ఇంతమంది సభ్యులతో ఇన్సూరెన్స్ చేసిన ప్రభుత్వ పథకం ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అందుకనే, చంద్రన్న భీమా పథకాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపే నిమిత్తం తమ తరుపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ‘చంద్రన్న భీమా’ గురించి వివరిస్తూ. ఈ భీమా చేయించుకున్న వ్యక్తి కనుక చనిపోతే సంబంధిత సంఘానికి సమాచారం ఇచ్చిన 48 గంట్లలోపు తొలుత రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నెలరోజుల్లోపు మిగిలిన రూ.4.95 లక్షలు భీమా కింద బాధిత కుటుంబానికి అందజేస్తారని తెలిపారు.అయితే ఈ పథకంలో చేరేందుకు ఆధార్ కార్డుతో అసలు అవసరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment