అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకో అడుగు ముందుకు వేస్తుంది. మొన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభించగా, నిన్న ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేసుకున్నారు.
ఈ విషయం మరచిపోకముందే నేడు అమరావతి నిర్మాణంలో ముందడుగు వేస్తూ కొన్ని శంఖుస్థాపనలు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 3.30 నిమిషాలకి నిర్ణయించిన ముహూర్తానికి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతో పాటు 7 కీలక రహదారులకు శంఖుస్థాపన చేయనున్నారు. వీటి శంఖుస్థాపనతో పాటుగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకీ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం అమరావతిలో లక్ష మందికి ఫస్ట్ రెసిడెంట్ కార్డులు, 37 వేల కుటుంబాలకు హెల్త్‌కార్డులతోపాటు నిరుద్యోగులకు ఆఫర్ లెటర్లను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అందజేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకి, నిర్మాణ సంస్థలకి స్పష్టం చేశారు.
దీనికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చే విందులో అరుణ్ పాటు మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు.
No comments:
Post a Comment