Saturday, October 22, 2016

కొడుకు వచ్చాడు…అదృష్టం తెచ్చాడు…

బాలగోపాలుడు చిత్రం చూశారా? అయితే మీలో ఎంతమందికి తెలుసు …కళ్యాణ్ రామ్ సినీ నట ఆరంగేట్రం ఆ సినిమాతోనే జరిగింది అని ? 
ఆ సినిమా లో ముద్దుగా బొద్దు గా హీరో బాలకృష్ణ ని నాన్న నాన్న అంటూ సందడి చేసిన బాలనటుడే నేడు ఇజం తో ఆలరిస్తున్న కళ్యాణ్ రామ్ …
ఇదిలా ఉంటే…బాబాయ్ బాలయ్య దారిలోనే నేడు అదే వయస్సు లో ఉన్న తన కొడుకు శౌర్య రామ్ ని వెండితెర కి పరిచయం చేసాడు …ఇక్కడ విశేషం ఏంటి అంటే అప్పట్లో బాలగోపాలుడు లో కళ్యాణ్ రామ్ ఎలా ఉన్నాడో నేడు ఇజం లో శౌర్య రామ్ అచ్చు గుద్దినట్లు ఉన్నాడు 
ఏది ఏమైనా ఇప్పటిదాకా అడపా దడపా హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఇజం సినిమా తో సంపూర్ణ నటుడి గా అన్ని వర్గాల నుంచి ప్రశంస లు అందుకుంటున్నాడు  …ఈ క్రమం లో వారసుడి ఎంట్రీ తో కళ్యాణ్ రామ్ సెకండ్ ఇన్నింగ్స్ భారీ హిట్ తో మొదలు పెట్టినట్లే కనిపిస్తుంది ….మరి ఈ సెంటిమెంట్ ని తదుపరి చిత్రాల్లో కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి …
నందమూరి  అభిమానులు మాత్రం  కొడుకు వచ్చాడు, తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు అంటూ  మురిసిపోతున్నారు 

No comments:

Post a Comment