Saturday, October 15, 2016

తెలంగాణ‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ షాక్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్ తెలంగాణ స‌ర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ షాక్ వెన‌క రెండు రాష్ట్రాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ జ‌రుగుతోంది. ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌కాయ‌లు రావాల్సి ఉన్నాయ‌ని చెపుతూ తెలంగాణ‌కు చెందిన సింగ‌రేణి సంస్థ ఏపీకి బొగ్గు సరఫరా నిలిపివేసింది. తెలంగాణ స‌ర్కార్ వేసిన ఈ ఎత్తుకు ఏపీ స‌ర్కార్ పై ఎత్తు వేసేందుకు రెడీ అవుతోంది.
త‌మ‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా నిలిపివేయడంతో ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో తాము కూడా అదే మార్గం అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ స‌ర్కార్ సింగ‌రేణి సంస్థ‌కు రూ.2 వేల కోట్ల బ‌కాయిలు చెల్లించాలి. అయితే అదే టైంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు నుంచి ఏపీకి రావాల్సింది 4 వేల కోట్లు వ‌ర‌కు ఉన్నాయి
ఈ నేప‌థ్యంలోనే ఏపీ స‌ర్కార్ సింగ‌రేణితో భ‌విష్య‌త్తులో కూడా అవ‌స‌రం లేకుండా కోల్ ఇండియాతో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఈ చ‌ర్చ‌లు ఫ‌లించిన వెంట‌నే సింగ‌రేణికి ఏపీ స‌ర్కార్ గుడ్ బై చెప్పేసి విద్యుత్ సంస్థలు బకాయిలు చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరా చేయబోమని అల్టిమేటం జారీ చేయాల‌ని చూస్తోంది.
సింగ‌రేణి కంటే కోల్ ఇండియా అందిచే బొగ్గే ఎక్కువ నాణ్య‌త‌తో ఉంటోంది. కోల్ ఇండియాతో ఒప్పందానికి ఏపీ జెన్ కో ఇప్పటికే లేఖ రాసింది. అది ఓకే అయితే.. సింగరేణితో సంబంధం పూర్తిగా తెంచుకోవడంతో పాటు తెలంగాణకు విద్యుత్ సరఫరా క్లోజ్ చేయ‌నుంది. అదే జ‌రిగితే తెలంగాణ‌కు పెద్ద షాక్ త‌గిలిన‌ట్టే అనుకోవాలి.

No comments:

Post a Comment