Monday, October 24, 2016

20 మంది మ‌గాళ్ల చేతిలో బందీ … టాప్ పోర్న్ స్టార్ క‌న్నీటి గాథ

సినీ రంగుల ప్ర‌పంచం కొంత‌మందికి మంచి లైఫ్‌ని ప్రసాదిస్తుంది. మ‌రికొంత‌మందికి ల‌క్ కుద‌ర‌క, ఎద‌గ‌లేక అనేక వ‌క్ర మార్గాల‌కు చేరిపోతుంటారు. సినీ ప్ర‌పంచంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఆ రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తు అయితే, సక్సెస్, ఆ స‌క్సెస్‌ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. వీటన్నింటికీ కావాల్సింది ల‌క్‌. ఆ ల‌క్ దొర‌క‌పోతే జీవితం ఎలా మారుతుందో చెప్ప‌డానికి ఈ చిన్న ఉదాహ‌ర‌ణే జపాన్‌కు చెందిన పోర్న్‌స్టార్ సాకీ కొజాయ్ క‌న్నీటి జీవిత గాథ‌. హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఈ రంగంలోకి అడుగుపెట్టి చివరికి పోర్న్‌స్టార్‌గా మిగిలింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..


సాకీ కొజాయ్ అనే 24 ఏళ్ల అందమైన యువతి. మోడలింగ్‌లోకి ప్రవేశించి సినిమా స్టార్‌ అయిపోదామని ఎన్నో కలలు కంది. చదువు పూర్తయిన వెంటనే ఓ మోడలింగ్‌ ఏజెన్సీని సంప్రదించింది. వారు ఆమెను అన్ని రకాలుగానూ పరీక్షించి ఆమెతో కాంట్రాక్ట్‌ పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు. రెండు రోజుల అనంత‌రం ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. హీరోయిన్ అవ్వాలని ఓ వెలుగు వెలిగిపోవాలని ఆడిషన్స్‌కు వెళ్లింది. చుట్టూ ఇరవై మంది నిలబడి కెమెరా ఆన్‌ చేసి బట్టలన్నీ విప్పేయమని సూచించారు.
ఎందుకు విప్పమన్నారో ఆ తర్వాత‌ అర్థమైంది అది ఓ పోర్న్‌ సినిమా షూటింగ్ అర్ధ‌మ‌యింది. సాకీ భయంతో కేకలు పెట్టింది. కానీ, 20 మంది మృగాళ్ల ముందు ఓడిపోయింది. ”నేను ఈ పని చేయలేను అని బ‌తిమ‌లాడాను. అప్పటికి నేను వర్జిన్‌ను. కానీ, బలవంతంగా నాతో శృంగారం చేయించారు. ఒకేరోజు నలుగురితో సెక్స్‌లో పాల్గొనేలా చేశారు. చెప్పకూడని చేయరాని పనులన్నీ చేయించారు” అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాధ‌ప‌డుతూ చెప్పింది.
ఆ చీకటి ప్రపంచం నుంచి బయటపడే మార్గం లేక, ఎదురించి బయటకు వస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. అందుకే రాజీ పడిపోయి పోర్న్‌స్టార్‌గా మారిపోయింది సాకీ. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి బయటపడి పోయినా.. వేరే దారిలేక పోర్న్‌ యాక్ట్రస్‌గానే కెరీర్ కొన‌సాగిస్తుంది.

No comments:

Post a Comment