రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారా వారి పల్లె ఒక్క సారిగా నిఘా నీడ లో కి వెళ్ళిపోయింది
ఈనెల 24న ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకున్నారన్న నిఘావర్గాల సమాచారంతో వారికి ఇప్పుడున్న బద్రతాసిబ్బందిని ప్రభుత్వం పెంచింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లితో పాటు శేషాపురం, ఆరేపల్లి రంగంపేట వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
చంద్రబాబు ఇప్పుడు విజయవాడ లో కదా ఉండేది, కుటుంబ సభ్యులు కూడా ఎవరు నారావారిపల్లితో ఉండట్లేదు మరి అక్కడ నిఘా ఎందుకు అనుకుంటున్నారా…ప్రస్తుతం ఇంటిలో ఎవరూ నివాసం లేకున్నప్పటికీ ప్రతిఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో నాలుగురోజులపాటు గ్రామంలో విడిది చేస్తున్నారు.
దీంతో నారావారిపల్లిలోని ముఖ్యమంత్రి స్వగృహంతో పాటు అటువైపు శేషాపురం, ఇటువైపు రంగంపేట కేంద్రాల వద్ద పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఏపీ పోలీసులతో పాటు ఏఆర్ఎస్ సాయుధ పోలీసులను జిల్లా ఎస్పీ నియమించారు. నారావారిపల్లిలో 50 మంది, రంగంపేట వద్ద 12 మంది, శేషాపురం వద్ద నలుగురు పోలీసు బలగాలను మోహరించాయి. నారావారిపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ పోలీసులు మోహరించారు. మరికొందరు నారావారిపల్లి గ్రామానికి నాలుగువైపులా సంచరిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment