ఆంధ్రప్రదేశ్ లో విమానాలు నడుపుతున్నారా?. మీకు నష్టం వస్తుందా?అయితే మీరు బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీకు ఏపీ ప్రభుత్వం సర్కారు సర్దుబాటు నిధి (విజీఎఫ్) కింద ఆరు నెలలకు ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఎస్ ఇది నిజం. తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
ఏపీ సర్కార్ ఒకప్పుడు విమర్శించి..ఇప్పుడు చంకనెక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ కుటుంబ సభ్యులు…రామ్ చరణ్ డైరక్టర్ గా ఉన్న టర్భో మెగా ఎయిర్ వేస్ కు సర్కారు 4.90 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ-తిరుపతి-విజయవాడ, విజయవాడ-కడప-విజయవాడ రూట్లలో సర్వీసులు నడిపినందుకు గాను ఈ ఎయిర్ లైన్స్ కు సర్కారు వీజీఎఫ్ కింద ఈ నిధులు మంజూరు చేసింది.
మరి ఈ సంస్థ విమానాలు నడిపితే వాళ్లకు ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.5 కోట్ల లబ్ధి కలిగేలా ఉత్తర్వులు జారీ చేయడం ఏంటన్న డౌట్ రాకుండా మానదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రూట్లు లాభదాయం కాదనే ఉద్దేశంతో వీజీఎఫ్ పెట్టి..ఈ పథకం కింద సర్కారు నిధులు కేటాయించింది.
ఇప్పటికే విమానాల్లో ఉపయోగించే ఇంథనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) పై అతి తక్కువ ఫన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంది. ఇదే ఎయిర్ లైన్స్ సంస్థలకు చాలా హెల్ఫ్ ఫుల్‌గా ఉంది. ఈ లాభం సరిపోదున్నట్టు అసలు కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు ఆరు నెలలకు గాను ఐదు కోట్ల రూపాయలు చెల్లించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మెగాపవర్ స్టార్ రాంచరణ్‌కు చెందిన ఈ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుందా అన్న చర్చలు కూడా ఓ వైపు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment