ఎవరు తీసుకున్న గొయ్యిలో వారే పడతారు అనే సామెత గుర్తుందా? ఇప్పుడు ఆ సామెత ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చుస్తే ఈ సామెత పాక్ కి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఉగ్రమూఖలని పెంచి పోషించిన పాక్ లోనే మారణకాండ సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు.
పాకిస్థాన్లోని క్వెట్టాలో అనే ప్రాంతంలో ఉన్న పాక్ పోలీసు శిక్షణా వసతి గృహంపై ఆరుగురు ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 30 మంది పోలీసులు మృతిచెందగా సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు పాక్ నిఘా వర్గాలు చెప్తున్నాయి.
దాడి సమయంలో శిక్షణా వసతి గృహంలో సుమారు 500 మంది పాక్ పోలీసులు ఉండగా దాడి అనంతరం వీరిలో 200 మందిని పాక్ ఆర్మీ సురక్షితంగా బయటకి తరలించింది. అయితే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కొంతమంది పోలీసులని తమ వద్ద బందీలుగా పెట్టుకున్నట్లు అక్కడి ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment