Wednesday, October 26, 2016

ఏపీలో 60 మినీ జిల్లాలు

చిన్న జిల్లాల‌తో ప‌రిపాల‌న సౌల‌భ్యం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పరిపాల‌న అంద‌రికి అందే ఉద్దేశంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 జిల్లాల‌ను కాస్తా 31 జిల్లాలుగా మార్చేశారు. అడిగిన వాళ్ల‌కు అడిగిన‌ట్టుగా కేసీఆర్ జిల్లాల‌ను ఇచ్చి ప‌డేశారు. ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో కేసీఆర్‌కు కాస్త భిన్నంగా వెళుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.
ఏపీలోని 13 జిల్లాలు ఇక‌పై 60 మినీ జిల్లాలుగా మార‌నున్నాయి. ఈ మేర‌కు చంద్ర‌బాబు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, పేరుకే జిల్లాలుగా పేర్కొన్నా అవి నేరుగా జిల్లాల స్వ‌రూపం సంత‌రించుకోవు! కేవ‌లం రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య‌ను మాత్ర‌మే 60 చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఇక్క‌డ జిల్లాల‌ను పెంచితే ర‌క‌ర‌కాల ఆందోళ‌న‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో రెవెన్యూ డివిజ‌న్ల‌ను పెంచి పాల‌న ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌కు చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న విధానం ప్ర‌కారం జిల్లా క‌లెక్ట‌ర్‌పై పెను భారం ప‌డుతోంది. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు అందుతున్నాయో అన్న‌దానిపై క్లారిటీ లేదు.
రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య పెరిగితే ప్ర‌స్తుతం డివిజ‌న్ స్థాయిలో ఉన్న అధికారుల‌కు మ‌రిన్ని అధికారాలు పెరిగి పాల‌న‌లో వేగం, పార‌ద‌ర్శ‌క‌త‌, అధికారుల జ‌వాబుదారీ త‌నం పెరుగుతాయి. డివిజ‌న్ల ఏర్పాటుతో ఆర్డీవోలు, డీఎస్పీల సంఖ్య పెరుగుతుంది. ఆర్డీవోలు, డీఎస్పీల‌కు అధికారాల‌ను పెంచుతారు. త్వ‌ర‌లోనే ఇది ఏపీలో అమ‌ల్లోకి రానుంది.

No comments:

Post a Comment