తమిళనాడులో ఏం జరుగుతుందో ఏమో అని నాకు కూడా చాలా టెన్షన్ గానే వుంది. ఎనభయ్యో దశకంలో ఎంజీఆర్ మరణించిన తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే అనేక పరిణామాలు సంభవించాయి. చివరికి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో సహా.
ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా కుటుంబ పాలనలకు కట్టుబడిన ప్రజాస్వామ్యం ఫలితంగా తమిళనాడు రాజకీయాలు, ప్రజా జీవితాలు అనేక మలుపులు తిరిగాయి. నెడంచెళియన్, తిరునావుక్కరసు లాంటి పేర్లు ఇప్పుడు వినపడవు, కనపడవు. ‘కామరాజ్ పాలన’ తెస్తామనే వాగ్దానంతో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీనే గల్లంతయిపోయింది. అనేక విషయాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లో సారూప్యం వుంటుంది.
ఏమైనప్పటికీ జయలలితకు ‘అమ్మ, దేవత’ స్థానం రావడానికి బలమైన కారణాలు వున్నాయి. డెబ్భయ్యో దశకంలో కరుణానిధి హయంలో సాగిన పాలన.. మహిళల్లో అభద్రతా భావాన్ని తెచ్చాయి. అధికార మధాంతంతో పార్టీల్లోకి ‘లంఫెన్’ సెక్షన్లను చేర్చుకున్నందుకు గాను డీఎంకె.. ఆ తర్వాత అనేక ఫలితాలు అనుభవించింది.
తమిళ రాజకీయాల నేపథ్యం తెలిసిన వారికి.. అనేక తమిళ సినిమాలు భలే నచ్చుతాయి. ఎంజీఆర్ చనిపోయినప్పుడు ధర్మపురి సంఘటనను గుర్తుచేసే ‘టెన్త్ క్లాస్’ (తెలుగులో టెన్త్ క్లాస్ కాదు, తమిళంనుంచి డబ్బయిన టెన్త్ క్లాస్) సినిమా అయినా.. ఒక మహిళా జర్నలిస్టు పట్ల అనుచితంగా వ్యవహరించిన స్టాలిన్ ను గుర్తుచేసే ‘రంగం’ సినిమా అయినా.. మరొకటి మరొకటి అయినా.. తమిళ రాజకీయాల నేపథ్యం తెలిసిన వారికి బాగా నచ్చుతాయి.
తమిళ రాజకీయాలు ఒక సినిమాను తలపిస్తాయి. ఒక నాటకాన్ని తలపిస్తాయి. అందరు నేతలూ బాగా చదువుకున్న వాళ్లే. ఎవరూ కూడా నోట్లో సిల్వర్ స్పూన్లతో పుట్టినవాళ్లు కాదు. చాలా దిగువ స్థాయినుంచి ఎదిగిన వాళ్లు. నటన తెలియడమే కాదు, రాయడం కూడా తెలిసిన వాళ్లే.
నటన మాత్రమే మిగిలిన వాళ్లు.. మిగుల్చుకున్న వాళ్లు.
రాజకీయాలు, సినిమాలు ఇంతగా ముడిపడిన రాష్ట్రం భారతదేశంలో మరొకటి వుండదు.

No comments:
Post a Comment