Monday, October 3, 2016

వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసారా? అయితే అన్ బ్లాక్ చేసుకోండిలా..



ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వారు లేరు. రెండో తరగతి చదువుతున్న వారికి కూడా స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడటం, మెసేజ్ లు పంపండం తెలిసిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని కూడా వాడుతుంటారు. సాధారణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వారు అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే స్కూల్ లో ఉండగానే స్మార్ట్ ఫోన్ లు వాడటం అలవాటైపోతుంది. ఇక వీరికి ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటివి లేకపోతే రోజు గడవదు. వీరిలో చాలా మంది ఓ సమస్యను ఎదుర్కొనే ఉంటారు.
అదే వాట్సాప్ లో బ్లాక్ చేయడం..!! సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్ బ్లాక్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ అధికారం కేవలం బ్లాక్ చేసిన వారికే ఉంటుంది. ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వారందరినుండి వారికి తెలియకుండా అన్ బ్లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

స్టెప్ 2:

వారి ప్రొఫైల్ పిక్చర్ మరియు వారి స్టేటస్ కనుక మీకు కనబడకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే.

స్టెప్ 3:

ఇప్పుడు అన్ బ్లాక్ చేసుకోడానికి ముందు మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 4:

ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.

స్టెప్ 5:

ఆ తర్వాత అకౌంట్ సెలెక్ట్ చేయండి.

స్టెప్ 6:

కింద మీకు డిలీట్ ఎకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నెంబర్ ఎంటర్ చేసి డిలీట్ ఎకౌంట్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7:

ఇప్పుడు మీ ఫోన్ లోని సెట్టింగ్స్ కి వెళ్ళండి.

స్టెప్ 8:

అక్కడ యాప్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి.

స్టెప్ 9:

ఇక్కడనుండి వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ చేయండి.

స్టెప్ 10:

అన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీ ఫోన్ ని రీస్టార్ట్ చేయండి.

స్టెప్ 11:

ఇప్పుడు కొత్తగా మరోసారి వాట్సాప్ ను ఇన్స్టాల్ చేయండి.

స్టెప్ 12:

అది అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే.

స్టెప్ 13:

ఇలా చేస్తే చాలు.. మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వారందరి బ్లాక్డ్ లిస్టు నుండి మీరు తొలగిపోతారు.

No comments:

Post a Comment