Tuesday, October 11, 2016

రాజధాని లో భూములు కొంటున్నారా అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణం రాజధాని లో ని  రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో కి వేదిక అయ్యింది …
ఈ ప్రాపర్టీ షో కి ప్రజల నుంచి  ఊహించని స్పందన రావటం తో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు …కృష్ణా , గుంటూరు జిల్లా ల నుంచి తరలి వచ్చిన సందర్శకులతో ఈ ప్రాపర్టీ షో  కళ కళలాడింది …
ఈ షో లో మొత్తం 140 వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయగా ….వీటిలో ముఖ్యంగా అపార్ట్మెంట్స్ , ఓపెన్ ప్లాట్స్ కేటగిరి ల పై ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ పై సందర్సకులు ఆసక్తి కనబరిచారు .
ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమం ముగింపు వేడుక కి  సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ముఖ్య అతిధి గా వచ్చారు …ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజలు అనధికార లే అవుట్ లు , నిర్మాణాల విషయం లో అప్రమత్తంగా ఉండాలి అని చెబుతూ ఏదయినా కొనుగోలు చేసే ముందు అన్ని అధికార అనుమతులు ఉన్నవి అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ఏదయినా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని లేకపోతే తదుపరి రోజులలో ప్రభుత్వ చేపట్టే చర్యలకు బాధితులు అవుతారు అని చెబుతూ వారం లో ఒక రోజు సీఆర్‌డీఏ అధికారులంతా అందుబాటులో ఉంటారని ఆ రోజున అటు లేఔట్ వేసే వారు కాని ప్రజలు కాని వారికున్న ఎటువంటి అనుమానాలు అయినా నివృత్తి చేసుకోవచ్చు” అని తెలిపారు .
సో రాజధాని లో ఏదో ఒకటి పెట్టుబడి పెడదాము అనుకునే వారు అందరు ఆచి తూచి పెట్టే ప్రతి రూపాయికి భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలు గా ముందుగానే నిర్ధారించుకుంటే మంచిది.

No comments:

Post a Comment