Tuesday, October 11, 2016

తమిళ ప్రజల అపరభగీరధుడు చంద్రబాబు

తమిళ ప్రజల నీటి కష్టాలు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పేరుకి మహానగరమే అయినా తాగడానికి పనికిరాని ఉప్పు నీరు పక్కనే ఉన్న నగరం అది. ఒకప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా బ్రతికున్నప్పుడు ఆ నగరానికి మంచినీటి కొరత తగ్గించడానికి పైప్ లైన్ లు వేయడానికి భారీగా నిధులు సమకూర్చారు.
తరువాతి కాలంలో కావేరి నదీ జలాలను పక్క రాష్ట్రము అయిన కర్ణాటకతో పంచుకునే ఒప్పందం చేసుకుంది తమిళ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంతో తమిళనాడుకి సంబంధాలు అంతగా బాలేదు, మొన్నటికి మొన్న ఇరు రాష్ట్రాలు తీవ్రమైన గొడవలు పడ్డాయి. దీనితో కర్ణాటక తమిళనాడుకి నీటి విడుదల చేయకుండా తీవ్ర నీటి సమస్యకి కారణమైంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారు.
దీనిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి తెలుగు గంగా రిజర్వాయర్ ద్వారా 3 టియంసిల నీటిని విడుదల చేసి వారి నీటి సమస్యని పరిష్కరించేందుకు ముందుకి వచ్చారు. దీనితో ఒక్కసారిగా చంద్రబాబు తమిళ ప్రజల్లో హీరో అయిపోయారు. అయితే దీని వెనుక రాజకీయ కోణం సైతం దాగి ఉంది. ఇప్పటికే జాతీయ పార్టీగా ఎదిగిన టిడిపి వచ్చే తమిళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇది సాయపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఇప్పుడు తమిళ ప్రజల పట్ల భగీరధుడు చంద్రబాబే…

No comments:

Post a Comment