Tuesday, October 11, 2016

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓవరాక్షన్..!

క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది కరెక్టా కాదా..? ఈ విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. జెంటిల్ మన్ గేమ్ కు స్లెడ్జింగ్ అవమానం అని కొంత మంది అంటే, స్లెడ్జింగ్ వల్ల పోటీ తత్వం పెరుగుతుందని ఇంకొంతమంది వాదన. రెండింటిలోనూ నిజముంది. అయితే, ఏదైనా హద్దు దాటనంత వరకే బాగుంటుంది. అతి ఎక్కడైనా ప్రమాదమే. లేటెస్ట్ గా బంగ్లాదేశ్ కు ఇంగ్లాండ్ కు మధ్య మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఆదివారం రాత్రి రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎల్బీగా అవుటయ్యాడు. మొదట నాటౌట్ అన్న అంపైర్, రివ్యూ తర్వాత అవుట్ అని ప్రకటించాడు. ఆ వెంటనే బంగ్లా ప్లేయర్లు బట్లర్ కు వేళ్లు చూపిస్తూ, స్లెడ్జింగ్ చేశారు. అప్పటికే ఓటమి అంచుల్లో ఉన్న టీమ్ ను కాపాడటానికి విశ్వప్రయత్నం చేస్తున్న బట్లర్, వాళ్ల చేష్టలకు తిరిగి స్పందించాడు. బంగ్లా ప్లేయర్ల వైపు వెళ్తున్న బట్లర్ ను అంపైర్లు అడ్డుకోవడంతో అక్కడితో ఆ గొడవ ముగిసింది.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజంటేషన్ టైమ్ లోనూ బంగ్లా ఆటగాళ్లకు ఇంగ్లండ్ ఆటగాళ్లకు వ్యాగ్యుద్ధం నడిచింది. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు బంగ్లా ప్లేయర్లకు జరిగిన ఈ వివాదం, సహచరుల జోక్యంతో సద్దుమణిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వద్దకు చేరిన పంచాయితీలో, బంగ్లా ప్లేయర్లు మష్రాఫ్ మొర్తజా, సబ్బీర్ రెహమాన్ లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించగా, బట్లర్ కు మందలింపుతో సరిపెట్టారు. మూడు వన్డేల సీరీస్ లో మొదటి వన్డే ఇంగ్లాండ్ గెలవగా, రెండో వన్డే బంగ్లా గెలిచింది.

No comments:

Post a Comment