టాలీవుడ్ లో అర్ధవంతమైన సినిమాలు తీసే దర్శకుడిగా క్రిష్ కు పేరుంది. గమ్యం నుంచి కంచె వరకూ, తన సినిమాలో ఏదో ఒక మేసేజ్ తో పాటు, ఆడియన్స్ ను ఆలోచింపచేసే సినిమాలు తీస్తుంటాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్, మూవీపై వస్తున్న రూమర్ల గురించి స్పందించాడు. జార్జియా షెడ్యూల్ క్యాన్సిల్ అవడం, దాని బదులు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండటంతో సినీ వర్గాల్లో చాలా వార్తలొచ్చాయి. మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే హడావిడిలో క్వాలిటీలో రాజీపడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని బాలయ్య అల్టిమేటమ్ ఇచ్చారని ఆ వార్తల సారాంశం.
అయితే క్రిష్ ఈ వార్తలను కొట్టి పారేశాడు. అవసరమైతే సినిమా రిలీజ్ అయినా పోస్ట్ పోన్ చేస్తాం తప్ప, మూవీ అవుట్ పుట్ పై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశాడు. సినిమా కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడట్లేదని, జార్జియా షెడ్యూల్ క్యాన్సిల్ అవడానికి ఇతరత్రా కారణాలున్నాయని క్రిష్ అంటున్నాడు. ఒక పక్క క్వాలిటీలో తగ్గే ప్రసక్తి లేదంటూనే, మరో పక్క సంక్రాంతికి కూడా వచ్చేలాగే మూవీని చూస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు క్రిష్. సంక్రాంతికి ఖైదీనెంబర్ 150 సినిమా కూడా కన్ఫామ్ గా రానుండటంతో, బాలయ్య సినిమా కూడా ఆ టైమ్ కే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ లెజండ్స్ ఇద్దరి క్లాష్ ఎలా ఉండబోతుందో చూడాలి.
No comments:
Post a Comment