అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే సరి.
ఉపయోగాలు:-
- ఎముకలను గట్టితనాని ఇస్తుంది.
- పొట్ట దగ్గిర పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది.
- శరీరానికి ఆలసట రాకుండా చేస్తుంది.
కావలిసిన పదార్ధాలు:-
- ఉలవపిండి- 50 గ్రామ్
- జీలకర్రపొడి – 1 స్పూన్
- వాటర్- 1/2 లీటర్
- అల్లం- చిన్నముక్క
- మిరియాలపొడి- కొంచెం
- రాక్ సాల్ట్- రుచికి సరిపడినంత
తయారీవిధానం:-
- ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో వాటర్ పోసి కొంచెంసేపు మరగనివ్వాలి.
- తర్వాత దానిలో జీలకర్రపొడి, అల్లం వేసి 2 టూ 3 మినిట్స్ మరగనివ్వాలి.
- తర్వాత దానిలో ఉలవపిండి వేసి గరిటతో బాగా కలిపి 2 టూ 3 మినిట్స్ మరగనివ్వాలి.
- తర్వాత దానిలో రాక్ సాల్ట్ కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే ఉలవల సూప్ రెడీ. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే సాగిన పొట్ట తప్పకుండా తగ్గుతుంది.
గమనిక:- ఉలవల సూప్ ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల మద్యలో తీసుకోవాలి. ఇలా ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
No comments:
Post a Comment