Monday, October 3, 2016

హైదరాబాద్‌ సచివాలయాన్ని వీడి ఏపీకి వెళ్తూ ఓ ఉద్యోగి రాసిన లేఖ రెండు రాష్ట్రాల ఉద్యోగుల‌ను క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఏపీకి వెళుతున్న స‌ద‌రు ఉద్యోగి కాట‌మ‌రాజు అనే అజ్ఞాత వ్య‌క్తం పేరుతో ఈ లేఖ రాశాడు. ‘క ళ్లే కాదు… గుండె కారుస్తోంది నీరు’ శీర్షికతో రాసిన అత‌డు రాసిన లేఖ తెలంగాణ ఉద్యోగుల గుండెలను పిండేసింది. అరవై ఏళ్లుగా తెలంగాణతో మమేకమై… రాష్ట్ర విభనతో ఏపీకి శాశ్వతంగా వెళుతున్న బాధ‌తో స‌ద‌రు ఉద్యోగి ఈ లేఖ రాశాడు.
స‌ద‌రు ఉద్యోగి ఆ లేఖ‌ను తెలంగాణ సచివాలయంలోని పలుచోట్ల అతికించారు. ఆ లేఖ చదివిన ఉద్యోగులు కంటతడిపెడుతున్నారు. ఆ లేఖలో సారాంసం చూస్తే
” అనంత కాలప్రవాహంలో చరిత్రలో ఎన్నో మలుపులు. ఈ మలుపులు కొంతమందికి సంతోషాన్ని, మరికొంతమందికి బాధను కలుగజేస్తాయి. ఇంకొంతమందికి రెండింటినీ కలుగజేస్తాయి. ఈ మలుపు మనసును మెలిపెడుతోంది. కొన్ని సంవత్సరాలు ఇక్కడి గాలిపీల్చాం… ఇక్కడి నీళ్లు తాగాం. ఇక్కడి ప్రజలతో కలిసిపోయి… పరిచయాల్ని స్నేహాల్ని పంచుకొని, కొంతమందితో ఏకంగా బంధాల్నీ, బంధుత్వాన్ని పెంచుకొని నడయాడిన నేలను వీడుతున్న వేళ… కళ్లే కాదు గుండె నీరు కారుస్తుండగా సెలవు అడుగుతున్నాం. ఏ బంధం ఒక్క జన్మలో బలపడదు. అది అనేక జన్మల సంబంధాన్ని కలిగి ఉంటుంది. మిమ్మల్నందరినీ కొత్త సచివాలయానికి ఆహ్వానిస్తూ ”
… జ్ఞాపకాలతో
మీ కాటమరాజు
leka

No comments:

Post a Comment