Monday, October 3, 2016

సీఎం జ‌య‌ల‌లితకు ఇంత‌కు ఏమైంది..!

ఇప్పుడు దేశంలో ఓ ముఖ్య‌మంత్రి ఆరోగ్యం గురించి వ‌స్తోన్న వార్త‌లు పెద్ద దుమారం రేపుతున్నాయి. లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు…. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు చెన్నై వ‌స్తున్నార‌నే వార్తలే శ‌నివారం త‌మిళ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో అస‌లు జయలలితకు ఏమైంది? అన్న చర్చ మొదలైంది.
నిన్న‌టి వ‌ర‌కు జ‌య‌ల‌లిత‌కు అస‌లు ఏమైందో ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కేవలం జ్వరం..డీహైడ్రేషన్ సమస్యలే అయితే సీఎం ఇన్ని రోజులు ఆసుప‌త్రిలో ఎందుకు ఉండాల్సి వ‌స్తుంది ? ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ? ఆ చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కే విదేశీ వైద్యుల అవసరం ఉంటుందా? అన్న చర్చ బయలుదేరింది. అయితే ఎవరూ ఈ విషయంపై నోరు మెదపటం లేదు.
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు వ్యాప్తంగా అంద‌రిలోను జ‌య‌ల‌లిత(68) గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ప‌ది రోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె గురించి గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్‌లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజుల వ‌ర‌కు దీనిపై బులిటెన్లు వ‌చ్చాయి. ఆమె కోలుకుంటున్న‌ట్టు వైద్యులు చెప్పారు. ఇప్పుడు స‌డెన్‌గా బులిటెన్స్ ఆగిపోవ‌డంతో అంద‌రిలోను ఆమెకు ఏమైంద‌న్న ఆందోళ‌న ప‌ట్టుకుంది.
యలలితతోపాటే ఐసీయూలో ఆమెకు తోడుగా ఉంటున్న నెచ్చెలి శశికళ అసలు బయటకే రావడం లేదు. ఆమె ఇంటికి కూడా వెళ్లడంలేదు. దాంతో ఇది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్రపతికి సుప్రీం న్యాయవాది లేఖ
జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు ఏమీ చెప్పడం లేదని రీగన్ ఎస్. బెల్ అనే న్యాయవాది ఆ లేఖలో పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను సైతం జ‌య‌ల‌లిత‌ను చూసేందుకు అనుమ‌తించ‌డం లేద‌ని….త‌క్ష‌ణ‌మే ఆమె ఆరోగ్యం గురించి బ‌య‌ట‌కు వెల్ల‌డించాల‌ని ఆయ‌న కోరారు. రాష్ట్రంలో ప‌రిపాల‌న స్తంభించింద‌ని చెప్పిన ఆయ‌న ఈ ప‌రిస్థితుల దృష్ట్యా 356 ఆర్టిక‌ల్ ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి పాల‌న కూడా విధించాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment