Monday, October 3, 2016

పాక్‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్‌

భార‌త్‌పై దొంగ దాడుల‌తో విరుచుకుప‌డుతున్న దాయాది పాకిస్తాన్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి.నిన్న‌టికి నిన్న ఇటు భార‌త్ దాడులు ఓ వైపు, అటు ఇరాన్ దాడులు ఓ వైపు కంటిన్యూ అవుతుండ‌డంతో పాక్ ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు. ఇరాన్ సైతం పాక్‌తో 2014లో కుదుర్చుకున్న కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మ‌రీ పాక్‌పై దాడులు చేసింది.
ఈ నేప‌థ్యంలో మోడీ పాక్‌ను చాలా తెలివిగా దెబ్బ‌కొట్టారు. సింధు జ‌లాల ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డం ద్వారా పాక్‌కు నీరు వెళ్ల‌కుండా పెద్ద ప్లాన్ వేశారు. దీని ప్ర‌భావంతో పాక్‌లో లక్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట‌పై ఎఫెక్ట్ ప‌డ‌నుంది. ఇక వ‌చ్చే నెల న‌వంబ‌ర్‌లో పాక్‌లో జ‌ర‌గ‌నున్న సార్క్ స‌ద‌స్సుకు భార‌త్ హాజ‌రుకాద‌ని కూడా మోడీ తేల్చిచెప్పారు.
భార‌త్ ఈ ప్ర‌క‌న‌ట చేసిందో లేదో సార్క్ దేశాలైన భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, అఫ్టానిస్థాన్‌లు సార్క్ స‌ద‌స్సును బ‌హిష్కరిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. భూటాన్ అయితే, భార‌త్ వంటి పెద్ద దేశం పాల్గొన‌ని స‌ద‌స్సులో మేం పాల్గొని ఏం చేస్తాం అని కుండ‌బద్ద‌లు కొట్టింది.
నిన్న‌టి వ‌ర‌కు ఒక్క మాల్దీవులు మాత్ర‌మే ఈ స‌ద‌స్సుకు వెళుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక ఇప్పుడు మాల్దీవులు కూడా పాక్‌కు షాక్ ఇచ్చింది. మాల్దీవులు కూడా సార్క్ స‌ద‌స్సును బ‌హిష్క‌రిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. దీంతో ఈ ప‌రిణామం అంత‌ర్జాతీయంగా పాక్‌ను ఒంట‌రిని చేసేసింది. దీంతో దిగివ‌చ్చిన పాక్ సార్క్ స‌ద‌స్సును వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

No comments:

Post a Comment