ఎం.ఎస్. థోనీ.. మైండ్ బ్లోయింగ్ మూవీ. సినిమాకెళ్లబోయే ముందు జస్ట్ రివ్యూ రైటర్లు ఎలా రివ్యూ రాశారోనని జస్ట్ ఛెక్ చేశా.. సినిమా చూశాక రివ్యూ రైటర్ల మీద ఉన్న కొద్దిపాటి గౌరవం పోయింది. ఓ జీవితాన్ని పోర్ట్రయిట్ చేసేటప్పుడు జీవితాన్ని జీవితంలా చూడాలి కానీ సినిమాలా చూడకూడదు. ఆ డిఫరెన్స్ కూడా తెలీని రివ్యూ రైటింగ్ చేసినా ఒకటే చెయ్యకపోయినా ఒకటే!
అలాగే ప్రేక్షకులకి ఓ పెద్ద విజ్ఞప్తి.. హీరోయిన్ వెంటపడీ, నాలుగు కుళ్లు కామెడీ సీన్లు పెట్టీ, ఓ ఐటెమ్ సాంగ్ పెట్టీ, మిక్సర్ పొట్లంలా తయారు చేసే సినిమాల్ని ఎంతకాలం చూస్తారు... కనీసం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాల్ని చూస్తే జీవితం పట్ల కాస్త ఇన్స్పిరేషన్, ఫ్రెష్ ఫీల్ అయినా వస్తుంది.
ఇకపోతే సినిమాలో సెకండాఫ్ మొత్తం ప్రతీ సీన్ ఎమోషనల్ అవకుండా కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. ఈ మూవీనే కాదు, ఈ మధ్య చూసిన సుల్తాన్, లాస్ట్ ఇయర్ బజరంజి భాయీ జాన్.. ఈ మూడు సినిమాలు గుండెల్ని కదిలించాయి.
సినిమా లాస్ట్ సీన్ థియేటర్ మొత్తం నిలబడి క్లాప్స్ కొట్టారంటే ప్రేక్షకుల్ని ఎంత కదిలిలించిందో అర్థం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment